ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 68 మండలాల్లో కరువు పరిస్థితులు.. తక్షణ సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశం.

ప్రతిపక్షం, అక్టోబర్ 28: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 68 మండలాల్లో కరువు పరిస్థితులు: తక్షణ సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశం.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు పడిపోవడం మరియు సాగునీటి కొరత నేపథ్యంలో మొత్తం 73 మండలాలకు గాను 68 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టులు నిండకపోవడం, పంటలు భారీగా దెబ్బతినడంతో రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

జిల్లాల వారీగా కరువు మండలాలు.
నల్లగొండ జిల్లా మొత్తం 33 మండలాలకు గాను 28 మండలాలు కరువు జాబితాలో ఉన్నాయి. (దీనిలో 20 తీవ్ర కరువు, 8 సాధారణ కరువు మండలాలు).

సూర్యాపేట జిల్లా జిల్లాలోని మొత్తం 23 మండలాలు కరువు పీడితంగా ప్రకటించబడ్డాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలోని అన్ని 17 మండలాలు కరువు జాబితాలో చేరాయి.

*నల్లగొండ జిల్లా వర్గీకరణ
తీవ్ర కరువు మండలాలు (20): నకిరేకల్‌, చండూరు, మర్రిగూడ, చింతపల్లి, నాంపల్లి, నిడమనూరు, దామరచర్ల, అడవిదేవులపల్లి, తిరుమలగిరిసాగర్‌, పెద్దవూర, పీఏపల్లి, నేరడుగొమ్ము, గట్టుప్పల్‌, దేవరకొండ, చందంపేట, గుండ్లపల్లి, కనగల్‌, మునుగోడు, నార్కట్‌పల్లి, శాలిగౌరారం.

సాధారణ కరువు మండలాలు (8): చిట్యాల, కేతేపల్లి, నల్లగొండ, త్రిపురారం, మాడ్గులపల్లి, వేములపల్లి, తిప్పర్తి, మిర్యాలగూడ.

*కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర విజ్ఞప్తులు.
కరువు సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ కింద రూ. 20,000 కోట్ల ప్రత్యేక కరువు ప్యాకేజీని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనితో పాటు, పంట నష్టం, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం ఏర్పాట్లకు నిధులు. ఉపాధి హామీ కింద 50 అదనపు రోజుల పని దినాలు.ఎరువులు మరియు 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్ సరఫరా.

*కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు
రాయితీ పంపిణీ: కేంద్ర సహాయం అందిన నెల రోజుల్లోగా ‘Direct Benefit Transfer’ (DBT) ద్వారా రైతులకు వ్యవసాయ ఉత్పాదక రాయితీ అందించాలి.

రుణాల పునర్వ్యవస్థీకరణ: ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయాలి మరియు బలవంతపు వసూళ్లను నిలిపివేయాలి.

తాగునీరు & పశుగ్రాసం: తాగునీటి సరఫరా పెంచడంతో పాటు అవసరమైన చోట్ల పశువుల శిబిరాలు, పశుగ్రాసం ఏర్పాటు చేయాలి. పట్టణ ప్రాంతాలను కూడా తాగునీటి ప్రయోజనాల కోసం కరువు మండలాలతో సమానంగా చూడాలి. కరువు సహాయానికి సంబంధించిన సమగ్ర నివేదికను వారంలోగా పంపాలని ప్రణాళికా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. సంక్షోభంలో ఉన్న రైతు లోకాన్ని మరియు ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేయడమైనది.

Spread the love

Related News

Latest News