సైబరాబాద్, ప్రతిపక్షం,అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాల మేరకు పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) ను పురస్కరించుకుని అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
పోలీసు సిబ్బందిలో సృజనాత్మకతను, రచనా నైపుణ్యాలను, ఆలోచనా శక్తిని ప్రోత్సహించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీయడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. ఈ పోటీలను తెలుగు, ఆంగ్ల భాషల్లో రెండు కేటగిరీలుగా నిర్వహించారు.
మొదటి కేటగిరీలో ఏఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు, రెండవ కేటగిరీలో ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు మరియు అంతకంటే పైస్థాయి అధికారులకు అవకాశం కల్పించారు.
తెలుగు వ్యాసరచన పోటీల విజేతలు:
- మొదటి కేటగిరీ: ప్రథమ బహుమతి – కె. రమేష్, ద్వితీయ బహుమతి – పి. జ్యోతి, తృతీయ బహుమతి – జి. రాజమణి
- రెండవ కేటగిరీ: ప్రథమ బహుమతి – బి. వెంకటరమణ, ద్వితీయ బహుమతి – జె. ఉపేందర్, తృతీయ బహుమతి – జి. శశిధర్
ఆంగ్ల వ్యాసరచన పోటీల విజేతలు:
- మొదటి కేటగిరీ: ప్రథమ బహుమతి – జి. రూప, ద్వితీయ బహుమతి – ఈ. సునీత, తృతీయ బహుమతి – ఎం. దివ్య
- రెండవ కేటగిరీ: ప్రథమ బహుమతి – ఎన్. రోహిణి, ద్వితీయ బహుమతి – ఎస్. రఘు, తృతీయ బహుమతి – వి. యతీష్ చంద్ర
ఈ సందర్భంగా విజేతలందరినీ Dr. M. Ramesh, IPS, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు. పోలీసు సిబ్బందిలో ప్రతిభను ప్రోత్సహించడానికి, వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు.





























