ప్రతిపక్షం, బోథ్ ప్రతినిధి, మే 23 : ప్రపంచ శాంతి దూత, సత్యాన్వేషకుడు మహా బోధి బుద్ధుని జన్మదిన సందర్భంగా నేడు సోనాల గ్రామంలో అంబేద్కర్ సంఘం, బౌద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోనాలలోని బౌద్ధ విహార్ యందు పంచశీల పతాక ఆవిష్కరణ చేసి.. బుద్ధుని విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బౌద్ధ సొసైటీ మండల శాఖ అధ్యక్షులు అమృత్ రావ్ మాట్లాడుతూ.. బుద్ధుడు చూపించిన జ్ఞానమార్గం, అష్టంగా మార్గం ద్వారా ప్రజలు సత్య అన్వేషణ వైపు కొనసాగుతూ కోరికలతో కలిగే దు:ఖాలను జయించి సత్యం వైపు ప్రయాణించే ఈ మార్గాలు ప్రపంచానికే ఆదర్శమన్నారు. అందుకే బౌద్ధమతం ప్రపంచంలో ఎన్నో దేశాల్లో విస్తరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భగత్, ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి కే. లక్ష్మణ్, బత్తుల రమేష్, మద్దేల మహేష్, సోమన్న, రాజారాం, రాహుల్, కిరణ్, స్వామి, గడప ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.