Trending Now

తెలంగాణలో వేలాది మంది అమరులైంది ఎవరి వల్ల..? : కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల..? అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా సంచలన ప్రశ్నలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల..? అని ప్రశ్నించారు. 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు..? కాంగ్రెస్ ప్రభుత్వం, 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం.. అని పేర్కొన్నారు.

1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు ? కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ? కాంగ్రెస్ ప్రభుత్వం.. అంటూ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు? అని సమాధానం చెప్పాలని కోరారు.

Spread the love

Related News

Latest News