Padi Kaushik Reddy Vs Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపై గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీళ్లతోపాటు మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా కేసులు నమోదు చేశారు. ఇందులో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్‌తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్‌లను పోలీసులు నిందితులుగా చేర్చారు.