తీవ్ర రోడ్డు ప్రమాద బాధితుడికి పునర్జన్మ
ప్రతిపక్షం,రామగుండం (ప్రతినిధి),సెప్టెంబర్ 11: తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురై,ముఖం మరియు దవడ ఎముకలు పూర్తిగా విరిగిపోయిన ఒక పేద బాధితుడికి రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్ ) వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుండి కాపాడారు.
ఘటన & శస్త్రచికిత్స వివరాలు:
హన్మకొండ సమీపంలోని కనగర్తికి చెందిన సదానందం అనే వ్యక్తి తీవ్ర రోడ్డు ప్రమాదంలో “లీఫోర్డ్ 3 ఫ్రాక్చర్ – బైలాటరల్” (ముఖం,దవడ ఎముకలు తీవ్రంగా విరిగిపోవడం) గురయ్యారు. ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు జిజిహెచ్ గోదావరిఖనికి తీసుకువచ్చారు.సాధారణ పద్ధతిలో శ్వాస ట్యూబ్ వేయడం అసాధ్యం కావడంతో, అనెస్థీషియా మరియు డెంటల్ వైద్యులు అత్యంత నైపుణ్యంతో “సబ్మెంటల్ ఇంట్యూబేషన్” అనే అరుదైన విధానం ద్వారా గడ్డం కింద నుండి ట్యూబ్ అమర్చారు. అనంతరం నాణ్యమైన ఇంప్లాంట్స్‌తో ముఖ భాగాన్ని క్షుణ్ణంగా రీ-కన్స్ట్రక్షన్ (పునర్నిర్మాణం) చేసి,రెండు వైపులా ఎముకలను విజయవంతంగా ఫిక్స్ చేశారు.
వైద్య బృందం:
డెంటస్ట్రీ విభాగం:- డాక్టర్ సుమలత (హెచ్ఓడి ),డాక్టర్ శ్రవణ్ తేజ (మాక్సిల్లోఫేషియల్ సర్జన్),డాక్టర్ లహరి,డాక్టర్ నైనా.అనెస్థీషియా విభాగం:- డాక్టర్ భానులక్ష్మి (హెచ్ఓడి ), డాక్టర్ రాజేశ్వరి,డాక్టర్ కరుణాకర్.
గత 3 ఏళ్లలో డెంటల్ విభాగం ప్రతిభ:
గత రెండున్నర – మూడేళ్లలో జిజిహెచ్ డెంటస్ట్రీ విభాగం అద్భుతమైన సేవలు అందించింది.మన రాష్ట్రంలోనే అత్యధికంగా ‘మాక్సిల్లోఫేషియల్ ట్రౌమా’ (ముఖం/దవడ గాయాల) కేసులను చికిత్స చేస్తున్న ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జిజిహెచ్ గోదావరిఖని ఒకటిగా నిలిచింది.ఇక్కడ అత్యంత క్లిష్టమైన ట్రౌమా కేసలే కాకుండా:
మాక్సిల్లో ఫేషియల్ పాథాలజీ కేసులు & క్లిష్టమైన సిస్ట్‌లకు చికిత్స ఓరల్ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ (డైగ్నోసిస్ ) టొబాకో సెసేషన్ (పొగాకు మానెయ్యడానికి కౌన్సెలింగ్) ప్రోగ్రామ్‌లు అన్ని రకాల జనరల్ డెంటల్ చికిత్సలను విజయవంతంగా అందిస్తున్నారు.
సూపరింటెండెంట్ అభినందనలు & కుటుంబ సభ్యుల సంతోషం:
ప్రస్తుతం పేషెంట్ పూర్తి క్షేమంగా (కంప్లీటెలీ స్టేబుల్ ) ఉన్నారు.ఉచితంగా నాణ్యమైన ఇంప్లాంట్స్‌తో వైద్యం అందించినందుకు బాధితుడి కుటుంబ సభ్యులు కంటినీటితో కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంక్లిష్ట ఆపరేషన్‌ను విజయవంతం చేసిన డాక్టర్ల టీమ్‌ను సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు సింగ్ మరియు ఆర్ఎంఓ డాక్టర్ కృపాబాయి ప్రత్యేకంగా అభినందించారు.




























