మెదక్ ఏరియా ఆసుపత్రిలో మంచినీటి వృథా

పట్టించుకోని అధికారులు.. ప్రజల్లో ఆగ్రహం!

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 28: జిల్లాలో ఎలెన్నో ప్రభావంతో మంచినీటిని కాపాడాలని మంచి నీటిని వృధా చేయవద్దని ఒకవైపు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నీటి సంరక్షణపై అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మాత్రం మంచినీరు వృథాగా పోతోంది. మంచినీటి నీరు వృథా అవుతున్నా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నీటి వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News