మాధవానంద సరస్వతి స్వామివారి పాదుకా పూజలో బిఆర్ఎస్ నేతలు

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 29: మెదక్‌ పట్టణంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి నివాసంలో గురువారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి పాదుకా పూజ కార్యక్రమo నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి దంపతులు. మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్. రాష్ట్ర నాయకుడు మెదక్ అసెంబ్లీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి. టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో గురువుల ఆశీస్సుల ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక విలువల ఆవశ్యకతను కొనియాడారు. ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని గుర్తించాలని, తల్లిదండ్రులకు సేవ చేయడంతో పాటు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు సందేశమిచ్చారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మానవ సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Spread the love

Related News

Latest News