ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై నిన్న విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ ఆఫీస్‌కు చేరుకొని మీడియాతో మాట్లాడనున్నారు. తన అరెస్టును ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. కాగా నిన్న కేజ్రీవాల్ విడుదల అనంతరం ఆయన భార్య సునీత ‘హనుమాన్ జీ కీ జై’ అంటూ ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. 50 రోజుల తర్వాత బయటికి వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు.