ప్రతిపక్షం, దుబ్బాక, మే 21: భారత దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి రాజీవ్ గాంధీ అని అన్నారు. మంగళవారం భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార, ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పీఎసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దుబ్బాక నియోజకవర్గం సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఉషయ్యగారి రాజి రెడ్డి, ఉపాధ్యక్షుడు గోపి, మున్సిపల్ ఉపాధ్యక్షులు తొట్ల చంద్రం, సీనియర్ నాయకులు మట్ట కిషన్ రెడ్డి,దుబ్బాక మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ హర్ష రెడ్డి, దుబ్బాక మున్సిపాలిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్,ఐరేని సాయితేజ గౌడ్, తుమ్మ శంకర్, గుండెల్లి దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.