ట్రాఫిక్ కంట్రోల్ పోలీసన్న బాక్స్ కబ్జా..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 4 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ పోలీసన్న బాక్స్ ను అక్కడే నిత్యం పండ్ల వ్యాపారం చేసే వ్యాపారి కబ్జా చేశారు. ఆ బాక్స్ లో నే నేరుగా తన పండ్ల పెట్టెలను ఇతర వాటిని పెట్టేసి ప్రతిరోజు కార్పెట్ ను చుట్టేస్తున్నాడు. అటు గుండా వచ్చే పోయేవారు పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. సదర్ ప్రదేశంలో పూర్తిగా రోడ్డుపైకి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తున్న ఈ వ్యాపారి తనకు ఏమి పట్టనట్లే వ్యవవహారిస్తూ తనదే రాజ్యంగా రోడ్డు భాగాన్ని కబ్జాలకు పాల్పడుతున్నాడు.