రోస్టర్ పాయింట్ సవరించాలి..

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్,అక్టోబర్ 29: విద్య, ఉద్యోగాలలో సామాజిక వివక్ష, ఆర్థిక వెనుకబాటు కోణాలను ఆలోచించి ఎస్సీ గ్రూప్ -3 కులాలకు న్యాయం చేస్తూ రోస్టర్ పాయింట్ 5 ను కేటాయించాలని మీసాల మల్లిక్ ప్రభుత్వాన్ని కోరారు.,అయితే జస్టిస్ షమీ అక్తర్ గారి కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14-2025 రోజున షెడ్యూల్డ్ కులాలను మూడు గ్రూపులుగా విభజించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే … మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ గ్రూప్ 3 వారికి మొదటి రోస్టర్ పాయింట్ 22 కేటాయించడంతో విద్యా ఉద్యోగ నియామకాలలో, అలాగే ప్రమోషన్లలో కూడా చాలా అన్యాయం జరుగుతుందని మొదటి పది రోస్టర్ పాయింట్ లో ఓపెన్ కేటగిరీకి చెందిన ఐదవ రోస్టర్ పాయింట్ కేటాయించి ఎస్సి గ్రూప్ -3 వారికి తగిన న్యాయం చేయాలని ఆయన అన్నారు.

1నుండి 20 విద్య ఉద్యోగ నియామకాలలో మిగతా అన్ని కులాలకు రోస్టర్ పాయింట్లు వచ్చాయని కేవలం ఎస్సీ గ్రూప్ 3 వారికి ఒక్కటంటే ఒక్క రోస్టర్ పాయింట్ కూడా 20లోపు రోస్టర్ పాయింట్ లేదని మీసాల మల్లిక్ అన్నారు.. ఒకటి నుంచి పది ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో ఎస్సీ గ్రూప్ 3 వారికి ఒక్క ఉద్యోగం కూడా లేదని, 5శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ రోస్టర్ పాయింట్ 22 ఉండడం వలన ఉద్యోగ అవకాశాలు 0% గా ఆవేదన వ్యక్తం చేశారు… గతంలో చాలా సందర్భములలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రోస్టర్ పాయింట్లను EWS, ST వర్గాల వారికి ఓపెన్ రోస్టర్ పాయింట్లను కేటాయించిందని అలాగే ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 3వారికి ఒకటి నుండి 20 లోపు రోస్టర్ పాయింట్లలో 5వ రోస్టర్ పాయింట్ మరియు 12వ రోస్టర్ పాయింట్ కేటాయించి సామాజిక సమన్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మీసాల మల్లిక్ కోరారు…

Spread the love

Related News

Latest News