పేదల సంక్షేమమే మా ప్రభుత్వ బాధ్యత

•110 లబ్ధిదారులకు రూ.38,84,200 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

•తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు:జిల్లెల చిన్నారెడ్డి

ప్రతిపక్షం, జూలై 06, వనపర్తి ప్రతినిధి: సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడం మా ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం అని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు:జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం నందు ఆయన 110లబ్ధిదారులకు రూ.38,84,200ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ…సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. ప్రభుత్వ భరోసాకు ప్రతీక అని అన్నారు.ప్రవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్ ,వనపర్తి జిల్లామాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, జిల్లామాజీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ చంద్రశేఖర్, వనపర్తి మండల్ మాజీ సింగల్ విండో అధ్యక్షుడు సహదేవుడు, కౌన్సిలర్ పీతంబర్ నాయక్,గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి, వనపర్తి మండల్ కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు నారాయణ, ఖిల్లా గణపురం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు విజయ్ కుమార్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News