“కలం స్నేహం” ఆధ్వర్యంలో అభినందన సభ

  • మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతిరాజ్ కు ఘనంగా సన్మానం

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 08: మెదక్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ పట్టణ ప్రజల అభివృద్ధిని ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ పట్టణ చరిత్రలో తనకంటూ ఒక పేరు నమోదు చేసుకునే విధంగా పట్టణ అభివృద్ధి ముందుకు సాగాలని కలం స్నేహం వ్యవస్థాపకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య.ఆకాం క్షించారు. కలం స్నేహం జాతీయ కన్వీనర్ రాధిక భూపతి రాజు మెదక్ మున్సిపల్ చైర్మన్ అయిన సందర్భంగా హైదరాబాదులో అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ సభలో. సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఆమెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు.అనంతరం గోపాల్ ఆచార్య మాట్లాడుతూ. మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన కనుగు రాధిక భూపతిరాజు. ఉన్నత స్థాయికి ఎదగాలని. పేద ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తూ ముందుకు వెళ్లాలని పట్టణ అభివృద్ధిని దిశగా ముందుకు తీసుకెళ్లి చరిత్రలో తనకంటూ ఒక పేరు నిలబెట్టుకోవాలని అయినా అన్నారు. కలం స్నేహం జాతీయ ఉపాధ్యక్షులు హరి రమణ. మాట్లాడుతూ… ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేసే నాయకులకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దిశగా రాధిక భూపతిరాజ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతిరాజ్ మాట్లాడుతూ… తనపై చూపిన అభిమానానికి కలం స్నేహం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పారదర్శక పరిపాలన అందిస్తూ, పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ప్రజలతనపై చూపిన అభిమానానికి కలం స్నేహం కుటుంబ సభ్యులం దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పారదర్శక పరిపాలన అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. విశ్వానమే తన బలమని, మెదక్ అభివృద్దే తన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఆ ఆదర్శ మున్సిపాలిటీ నిర్మాణానికి కృషి చేస్తానని కానుగు రాధిక భూపతిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హైద రాబాద్ అధ్యక్షులు జ్యోతి తిముర, భూపాలపల్లి అధ్యక్షురాలు వనజ, నల్గొండ అధ్యక్షురాలు జ్యోతి కలం స్నేహం సభ్యులు, సాహితీవేత్తలు, సామాజిక కార్య కర్తలు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొని రాధిక భూపతిరాజ్ కు అభినందించారు.

Spread the love

Related News

Latest News