నిరుపయోగంలో ఉన్న టిఎన్జీఓ భవనాన్ని తక్షణమే ప్రజా అవసరాలకు కేటాయించాలి

•తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు.ఖాదర్ పాష

ప్రతిపక్షం, జూలై 09, వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న టిఎన్జీఓ భవనం గత కొంతకాలంగా పూర్తి నిరుపయోగంగా మారి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుండటం విచారకరమని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు.ఖాదర్ పాష ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రజా ధనంతో నిర్మించిన టిఎన్జీఓ భవనం వృధాగా పడి ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని,ఈ భవనాన్ని కేవలం ఒక సంఘానికే పరిమితం చేయకుండా…పూర్తిస్థాయిలో పబ్లిక్ అధీనంలోకి తీసుకురావాలన్నారు.వనపర్తిలోని నిరుద్యోగ యువతీ, యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి వీలుగా ఈ భవనాన్ని తక్షణమే ఆధునిక డిజిటల్ లైబ్రరీగా లేదా ఉచిత స్టడీ హాల్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ భవనాన్ని ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ప్రజలను, నిరుద్యోగులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News