ప్రతిపక్షం, జూలై 10: తెలంగాణలో మొత్తం 15,982 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్, గద్వాల్ జిల్లాల్లో దరఖాస్తుల గడువు ముగియగా, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ములుగు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ పోస్టులకు ఇంటర్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జిల్లాలవారీ నోటిఫికేషన్లు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు:
తెలంగాణ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ రిక్రూట్‌మెంట్ పోర్టల్
















