నిరుపేద మృతురాలి కుటుంబానికి హరీశ్‌రావు ఆర్థిక సాయం

అలీమా కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత

ప్రతిపక్షం,నంగునూరు, అక్టోబరు 29: నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి అండగా నిలిచేందుకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆర్థిక సహాయం అందించారు. నంగునూరు మండలం అంక్షాపూర్ గ్రామానికి చెందిన దూదేకుల అలీమా (70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. అలీమా మృతి విషయాన్ని గ్రామ సర్పంచి మాయోజు పద్మ, బీఆర్ఎస్ నాయకులు బూసి రెడ్డి నరోత్తమ రెడ్డి, మాయోజు బుచ్చి వీరయ్య హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన హరీశ్‌ రావు తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన హరీశ్‌రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బుచ్చి వీరయ్య, వెంకట కృష్ణారెడ్డి, పెద్ద కిష్టయ్య, చిన్న కిష్టయ్య, బందారం సతీష్, వెంకటేష్, పిల్లి అశోక్, లక్ష్మణ్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News