- కేటీఆర్ తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ .
- తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో వజ్రమ్మ భేటీ – చేనేత అంశాలపై చర్చ.
- జాతీయ స్థాయిలో చేనేత సేవలకు కృషి చేయండి – వజ్రమ్మకు కేటీఆర్ అభినందనలు
- హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ వజ్రమ్మను సన్మానించిన కేటీఆర్ .
ప్రతిపక్షం గట్టుప్పల్ అక్టోబర్ 29 : ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కర్నాటి వజ్రమ్మ వెంకటేశం గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు.మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జాతీయ స్థాయిలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, రాష్ట్రంలో నేత కార్మికుల పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో చేనేత రంగానికి సేవలు అందించాలని కాంక్షిస్తూ కేటీఆర్ వజ్రమ్మను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి, నేత కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.బీఆర్ఎస్ హయాంలో చేనేతకు ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. నేతన్నల సంక్షేమానికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బండారి చంద్రయ్య, కర్నాటి అశోక్, చిలుకూరు అంజయ్య, పున్న కిశోర్, దోర్నాల నరేందర్, రాంబాబు, జగన్, కృష్ణయ్య, శ్రీనివాస్, వెంకటేశం, నగేశ్, వినోద్, మల్లేష్, అయోధ్య, గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





























