మునుగోడులో నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం.

*ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నూతన కమిటీ సభ్యులు.
*ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యుడు జంగిలి నాగరాజుకు నారబోయిన రవి ముదిరాజ్ సన్మానం
*నూతన బాధ్యతలు పొందిన నాయకులకు శుభాకాంక్షలు.
*టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి నారబోయిన రవి ముదిరాజ్

ప్రతిపక్షం – మునుగోడు అక్టోబర్ 29 : నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన జంగిలి నాగరాజు, కాంగ్రెస్ మండల కమిటీ నూతన సభ్యులు గురువారం మునుగోడులో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి నారబోయిన రవి ముదిరాజ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమితులైన జంగిలి నాగరాజును, మునుగోడు మండల కార్యదర్శిగా నియమితులైన ఆరేళ్ల సైదులును, మండల ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులైన పాలకూరి మహేష్ ను నారబోయిన రవి ముదిరాజ్ శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.వీరికి నూతన బాధ్యతలు అప్పగించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ సందర్భంగా నారబోయిన రవి ముదిరాజ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ బలోపేతానికి, ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాల్వాయి చెన్నారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనంత స్వామి, బొల్లం మహేష్, ఉప్పుత్తుల సత్యనారాయణ, గడగోటి నవీన్, జంగిలి నాగరాజు, కట్టేకుంట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News