Trending Now

హుస్నాబాద్‌లో పలు కుటుంబాలను సందర్శించిన మంత్రి పొన్నం..

ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 4: నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కుటుంబాలను సందర్శించారు. 5 వ వార్డు హనుమాన్ నగర్‌లో ప్రమాదవశాత్తు గొడపడి ఇళ్లు కూలడంతో బాధితురాలు చెవిటి పద్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన హమాలీ కూలీ ఉల్లెంగుల సంపత్ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం రాత్రి గుండెపోటుకు గురైన బత్తిని రామస్వామి గౌడ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. హుస్నాబాద్ పట్టణంలో హమాలీ సంఘం ను సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి నూతన హమాలీ భవన నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొయ్యాడ రామయ్య కుటుంబాన్ని, అలాగే మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లకావత్ రామన్న నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వల్లపు రాజు, భూక్య సరోజన, కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, మేకల వీరన్న యాదవ్, అక్కు శ్రీనివాస్, బంక చందు, గట్టు రాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News