పోలీసు కార్యాలయాల పనితీరే ప్రజల విశ్వాసానికి పునాది

•రికార్డులు, కేసుల నిర్వహణ, కార్యాలయ పరిపాలనపై క్షుణ్ణంగా పరిశీలన

•పెండింగ్ కేసులపై సీఐకి పలు కీలక సూచనలు

•వనపర్తి సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ: సునిత రెడ్డి

ప్రతిపక్షం, జులై 10,వనపర్తి ప్రతినిధి: పోలీసు కార్యాలయాల పనితీరే ప్రజల విశ్వాసానికి పునాది…రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, నాణ్యత ఉంటేనే పోలీసు శాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ:సునిత రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు.శుక్రవారం జిల్లా పరిధిలోని వనపర్తి సర్కిల్ కార్యాలయాన్ని ” వార్షిక తనిఖీలలో ” భాగంగా జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి వనపర్తి డిఎస్పీ.గిరిబాబు, సీఐ. సుగంధ రత్నంలు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం డైజెస్టర్ రికార్డు , ప్రభుత్వ ప్రాపర్టీ రిజిస్టర్, విలేజ్ రోస్టర్, పిటిషన్ రిజిస్టర్ లు , గ్రేవ్ కేసులపైలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను వనపర్తి సీఐ.సుగంధ రత్నంను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సర్కిల్ కార్యాలయాల పనితీరు జిల్లా పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.ప్రతి రికార్డును నిబంధనలకు అనుగుణంగా నవీకరిస్తూ, కేసుల దర్యాప్తును నాణ్యతతో,నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.ముఖ్యంగా లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, డిజిటల్ నమోదులు, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ “త్వరిత సేవలు మన విజయానికి కొలమానం అనే లక్ష్యంతో ప్రతి అధికారి విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో డిసిఆర్భి ఎస్సై.శివకుమార్, వనపర్తి సర్కిల్ ఎస్సైలు. హరీష్ కుమార్,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News