హైదరాబాద్‌లో బాలికపై లైంగిక దాడి.. పార్కుకు తీసుకెళ్లి అఘాయిత్యం

ప్రతిపక్షం, జూలై 17: హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పరిధిలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫతేనగర్‌కు చెందిన బాలిక పాఠశాలకు వెళ్తుండగా షాబాజ్‌ (27) ఆమెను వెంబడించాడు. అనంతరం బాలికను ఓ పార్కుకు తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత నిందితుడి స్నేహితుడు రఫీక్‌ బాలికను ఆటోలో తీసుకెళ్లి మరోచోట వదిలేసినట్లు సమాచారం. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి షాబాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రఫీక్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Spread the love

Related News

Latest News