రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికే తీసుకురావాలి.

గుర్రాలగొంది గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

ప్రతిపక్షం సిద్దిపేట రూరల్, అక్టోబర్ 30: రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికే తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్ అన్నారు. శుక్రవారం నారాయణ రావు పేట మండలం గుర్రాల గొంది గ్రామంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సెంటర్ నిర్వహకులకు సూచించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా గ్రామ పంచాయతీ తరఫున సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం చంద్రం, గ్రామ ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు మెంబెర్ లు రాజు, సుజాత, విజయ , పంచాయతీ కార్యదర్శి రమాదేవి, సీసీ హేమలత,ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News