ప్రతిపక్షం, వెబ్ డెస్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) అమెరికాలోని నార్త్ కరోలినాలో సాప్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీప్రియతో కలిసి కారులో వెళ్తుండగా వర్షంలో వేరే కారును ఢీకొట్టారు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. జరిగిన సంఘటనను పోలీసులకు తెలిపేందుకు తన భార్యను కారులోనే ఉంచి రోడ్డు పక్కనే నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా మరో కారు వచ్చి పృథ్విరాజ్ను ఢీకొట్టింది. దీంతో పృథ్వీరాజ్ అక్కడికక్కడే మృతిచెందారు. ఒక ప్రమాదం నుండి బయట పడిన వెంటనే మరో కారు మృత్యువు రూపంలో రావడం పృథ్విరాజ్ మృతిచెందడంతో విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
మృతుడి తండ్రి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని అలకాపురిలో ఉంటోంది. ఆయన రెండేళ్ల కిందటే మృతి చెందారు. పృథ్వీరాజ్ గత ఎనిమిది సంవత్సరాలుగా అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ర్ గా పని చేస్తున్నారు అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలోని సన్నిహితుల సాయంతో పోస్ట్ మార్టం అనంతరం ఆదివారంలోపు మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.