సైబర్ నేరాలపై విద్యార్థుల వినూత్న అవగాహన.
పి.ఎం.శ్రీ. పాఠశాల లో సైబర్ క్రైమ్ ఫై ప్రత్యేక కార్యక్రమం.
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్, 30: “నేషనల్ సైబర్ సెక్యూరిటీ” అవేర్నెస్ మంత్ సందర్భం గా కోరుట్ల పట్టణంలోని పీ.ఎం. శ్రీ. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో విద్యార్థులు వినూత్న రీతిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా పాఠశాల విద్యార్థులు తమ “స్కూల్ బ్యాగ్”లను నేలపై 1930, ఆకారంలో అమర్చి సైబర్ నేరాల పట్ల ప్రజలకు,తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైన ప్పుడు వెంటనే 1930, టోల్‌ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సందే శాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి సైబర్ అంబాసిడర్ చంద నాగరాజు,ఆర్ట్ టీచర్ పిస్కా వేణు, కే. శ్రీనివాస్ తదిత రులు మార్గదర్శనం చేస్తూ విద్యార్థులను ప్రోత్సహించా రు.విద్యార్థులు వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఇన్చార్జి ప్రధానో పాధ్యాయులు చావ్లా లక్ష్మీనారాయణ అభినం దించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సందేశాన్ని అందించారు.





























