“లక్షణాలు ఉంటే దాచుకోవద్దు – ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత చికిత్స”.
లెప్రసీ సర్వే పరిశీలన రాష్ట్ర అబ్జర్వర్ డా. రాజు.
ప్రతిపక్షం, జగిత్యాల, (ప్రతినిధి) అక్టోబర్, 30: ఇంటింటి సర్వేతో కుష్ఠు వ్యాధిని అరికట్టవచ్చని కుష్ఠు వ్యాధి సర్వే పరిశీలన రాష్ట్ర అబ్జర్వర్ డాక్టర్. రాజు తెలిపారు. జగిత్యాల జిల్లా కల్లెడ, పి. హెచ్. సి, పరిధి లోని దరూర్ సబ్ సెంటర్ ను శుక్రవారం LCDC ప్రోగ్రామ్ రాష్ట్ర అబ్జర్వర్ డా. రాజు సందర్శించారు.క్షేత్రస్థాయిలో జరుగుతున్న LCDC (Leprosy Case Detection Campaign) కార్యక్రమాన్ని ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్.సుజాత, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్. శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు.ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి చేస్తున్న సర్వే తీరును, నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి, లెప్రసీ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డా. రాజు మాట్లాడుతూ..”కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయదగిన వ్యాధని,భయపడాల్సిన అవసరం లేదన్నారు.ప్రారంభ దశలోనే గుర్తిస్తే శాశ్వత వైకల్యాలను నివా రించవచ్చని,శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తిమ్మిర్లు, బుడిపెలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు.
పరీక్షలు, మందులు అన్నీ ఉచితంగా ఇస్తున్నామన్నా రు. ఆశా వర్కర్లు చేస్తున్న ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. కుష్టు వ్యాధి చికిత్స ఆలస్యం చేస్తే నరాలు దెబ్బతిని చేతులు, కాళ్లు వంకరగా మారే ప్రమా దం ఉందని, అందుకే లక్ష ణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్. రాజు అవగాహన కల్పించారు.





























