టి. ఆర్. ఎస్., ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ బాధ్యతల వరకు.

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర.

టీ.ఆర్ ఎస్., మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడిగా లింగంపల్లి సంజీవ్, నియామకం.

ఉద్యమ స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి.

ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యం.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, అనంతరం రాజకీయాల్లో నూ ప్రజా జీవితంలోనూ తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లింగంపల్లి సంజీవ్ తెచ్చుకొని ఒక కీలకమైన బాధ్యత దక్కించుకున్నారు. తెలంగాణ రక్షణ సేన (టీ.ఆర్ ఎస్.) మెట్‌పల్లి, పట్టణ అధ్యక్షులుగా సంజీవ్ నియామకం అయినట్లు టి.ఆర్.ఎస్. పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, డాక్టర్. రఘు తెలిపారు. ఉద్యమ కాలం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు స్థానిక ప్రజలతో మమేకమై పనిచేసిన అనుభవాన్ని గుర్తిస్తూ పార్టీ అధిష్ఠానం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. శుక్రవారం టీ.ఆర్.ఎస్., వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యమ కాలం నుంచే చురుకైన పాత్ర..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఎన్నో ఏళ్ల ప్రజల ఆకాంక్ష. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు తమవంతు పాత్ర పోషిం చారు. ఈ క్రమంలో మెట్‌పల్లి, పట్టణంలోనూ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఉద్యమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం వంటి అంశాల్లో లింగంపల్లి సంజీవ్ క్రియాశీలకంగా వ్యవహ రించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తనవంతు పాత్ర పోషిస్తూ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా రాజకీయ, ప్రజా జీవితానికి దూరం కాకుండా స్థానికంగా తన కార్యకలాపాలను కొన సాగించారు.ప్రజాసేవ లోనూ అనుభవం.

రాజకీయాల్లో పదవులు మాత్రమే కాకుండా ప్రజలతో ఉండే సంబంధాలు, వారి సమస్యలపై స్పందించే తీరు నాయకుడికి గుర్తింపుని స్తాయి. ఈ నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ కౌన్సిల్ మాజీ కో-ఆప్షన్ సభ్యుడిగా సంజీవ్‌,కు పట్టణ రాజకీయాలు, మున్సిపల్ వ్యవహారాలు, స్థానిక ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడింది. పట్టణ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాల్లో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. రాజకీయ కార్యకలాపాలతో పాటు ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించ డం ద్వారా స్థానికంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌లోకి..
సంజీవ్ రాజకీయ ప్రస్థానంలో బీఆర్ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రాజకీయ కార్యక లాపాల్లో పాల్గొన్నారు. అయితే తదనంతర పరిణా మాల నేపథ్యంలోబీఆర్ఎస్‌, కు రాజీనామా చేసి “కల్వకుంట్ల కవిత” సమక్షం లో తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలనే లక్ష్యం తో కొత్త రాజకీయ ప్రయా ణాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో పార్టీ నాయకత్వం ఆయనకు మెట్‌పల్లి పట్టణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీ బలోపేతమే లక్ష్యం..
మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకా నికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్. రఘు,కు ధన్యవాదా లు తెలియజేశారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మెట్‌పల్లి పట్టణంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను సమన్వ యం చేసుకుంటూ ముందు కు సాగుతానని, ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుం టానని స్పష్టం చేశారు.

కొత్త బాధ్యతలపై పార్టీ శ్రేణుల్లో ఆశలు..
తెలంగాణ ఉద్యమ నేపథ్యం, స్థానిక రాజకీయాలపై అనుభవం, మున్సిపల్ కౌన్సిల్‌లో పనిచేసిన పరిచయం కలిగిన సంజీవ్‌కు పట్టణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన నాయకత్వంలో మెట్‌పల్లి పట్టణంలో పార్టీ కార్యకలాపాలు ఏ మేరకు విస్తరిస్తాయి. కొత్తగా యువతను, ఉద్యమకారు లను, పాత రాజకీయ అనుభవం ఉన్నవారిని ఏకతాటిపైకి తీసుకొస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఉద్యమ కాలంలో ఏర్పడిన పరిచయాలు, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించు కుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యతగా కనిపిస్తోంది. సంజీవ్, నియామకంపై టీ.ఆర్ ఎస్., శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Spread the love

Related News

Latest News