Trending Now

వరి కొనుగోలు కేంద్రం పరిశీలన..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 15 : నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్ పట్ల లో బుధవారం మధ్యాహ్నం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఓ పీడీ విజయలక్ష్మి ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్ని సంచులు తార్ఫాలీన్ లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్య పరిరక్షణ కోసం సంబంధిత కేంద్ర నిర్వాహకులతో పాటు రైతులు కూడా అనుక్షణం ఉండాలని పేర్కొన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ధాన్యం పరిరక్షణ కోసం అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో పాటు సంబంధిత రైతులపై కూడా ఉందని చెప్పారు. ఆమె వెంట కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో పాటు స్థానికులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News