ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : మహిళా పోలీస్ చట్టాలపై శుక్రవారం నిర్మల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మల్ పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ముందుగా ఆత్మరక్షణ విషయాలను పరిపూర్ణంగా తెలుసుకున్నారని చెప్పారు. ఒంటరిగా వెళుతున్న మహిళలు తగువిధంగా పోలీస్ సంబంధిత విషయాల పట్ల చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి ఎలాంటి అనుమానం ఉన్న అప్రమతం కావాలని కోరారు. మహిళల రక్షణకే షీ టీంలు పకడ్బందీ ప్రణాళికతో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సంబంధిత ఎలాంటి సమస్యలు ఇబ్బందులు వేధింపులు ఉన్న షీ టీం, పోలీస్ శాఖ కు సంబంధించిన ఫోన్ నెంబర్లపై సంప్రదించాలని కోరారు. మహిళలకు ఎలాంటి ఆపద వచ్చిన తక్షణమే 781 26 59 550, 100 నెంబర్లపై సంప్రదించి చీటింగ్ సేవలను పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి రాధిక ఇతరులు పాల్గొన్నారు.