దేశాభివృద్ధికి, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన మహానేత
మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతి రాజ్
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 31: భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతిని మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు మాట్లాడుతూ.. దేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ చరిత్ర సృష్టించారని, మహిళలు సంకల్పిస్తే దేశాన్ని నడిపించగలరని నిరూపించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ఎన్నో కీలక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారని గుర్తుచేశారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ మాట్లాడుతూ.. బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణలు, పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ వంటి నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇందిరా గాంధీ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుజ్జ పవన్, భూపతిరాజు, చింతల నరసింహులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు గౌస్ ఖురేషి, అవారి రాజశేఖర్, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ సూఫీ, బాలరాజ్ యాదవ్, ఎండీ ముజమ్మిల్, దేవుల నాయక్, గాడి రమేష్, ఎండీ షఫీ, సంఘ శ్రీకాంత్, రితీష్, నాగిరెడ్డి, పోచందర్, కొరివి రాములు, మహమ్మద్ షఫీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




























