ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్, 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించు కుని భారత్ సురక్ష సమితి, జగిత్యాల జిల్లా శాఖచే రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు, ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో గల పటేల్ విగ్రహానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఏసిఎస్ రాజు అక్కినపల్లి కాశీనాథం, సమరసత వేదిక కరీంనగర్, విభాగ్ సంయోజక్ చిట్ల గంగాధర్, లు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశనికి, మొదటి ఉప ప్రధానిగా, హోం మంత్రి,గా బాధ్యతలు నిర్వహించాడని దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భౌగోళికంగా భారతదేశం ముక్కలు కాకుండా ఒక్కటి చేసిన మహనీయుడని కీర్తించారు. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న 565, కు పైగా స్వదేశీ సంస్థానాల ను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసి అఖండ భారత దేశానికి పునాదులు వేసిన మహనీయుడని ఉక్కుమనిషి ఇండియన్ బిస్మార్క్ గా ప్రసిద్ధి చెందా డని అన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మన తెలంగా ణకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పించాడని, తెలంగాణలో ప్రజలు నిజాం పాలనలో బానిసల్లాగా బ్రతు కుతూ అనేక చిత్రహింసలకు గురయ్యారని స్త్రీల మానప్రా ణాలకు రక్షణ లేని పరిస్థితు లు ఉండేవని ఇలాంటి రాక్ష స, అరాచక పరిపాల నుండి 19 48, సెప్టెంబర్ 17, న మనకు విముక్తి కల్పించే స్వేచ్ఛ వాయువుల్ని పీల్చు కునే స్వాతంత్రాన్ని ప్రసాదిం చిన గొప్ప వ్యక్తిని ఇలాంటి స్వాతంత్రోద్యమ మహనీ యుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం మన బాధ్య తని అన్నారు.ఆయన చేసిన సేవలకు గుర్తుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, ఇతని పుట్టినరో జును జాతీయ ఐక్యత దినంగా జరుపుకుంటారని దేశం కోసం త్యాగాలు చేసిన ఇలాంటి నాయకుల జీవితా లను యువత ఆదర్శంగా తీసు కోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి సింగం గంగాధర్, 22, వ వార్డు కౌన్సిలర్ ఆరవ లక్ష్మి, కొత్తకొండ బాలన్న గాదాసు భూమన్న నరేందుల శ్రీనివాస్, ఎడమల వెంకట్, రెడ్డి చిలుక రాజన్న, వంగల భాస్కర్, ఇల్లెందుల పురుషోత్తం, గండ్ర ప్రవీణ్, రావు, కొక్కిరాల గోపాల రావు, ఆడెపు జానయ్య, సిరిపురం గంగారం, నాయిని సంజీవరావు, బండి సత్యం, దొనకంటి జనార్దన్ రెడ్డి, పెండెం గంగాధర్, పాల్గొన్నారు.






























