ప్రతిపక్షం, వెబ్డెస్క్: లేడీ డాన్ అక్రమంగా నిర్వహిస్తున్న గేమింగ్ అడ్డా పై సైబరాబాద్ SOT దాడి చేశారు. ఈ ఘటనలో రూ.62,620/- నగదును 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కమ్మంపాటి మాధవి అనే మహిళ గత కొంత కాలంగా అక్రమంగా గేమింగ్ (మూడు ముక్కలాట) నిర్వహిస్తుందని తెలుసుకుని.. ఖాజాగూడ లో ఫ్లాట్ నెం. 304, AC అట్లాంటిక్స్ అపార్ట్మెంట్ పై దాడి చేశారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుండి ఫంటర్స్ ను పిలిపించి గేమింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఆటకు రూ 1000/- లు ఆర్గనైజర్ ఫీ వసూలు చేస్తూ, రోజులో సుమారు 100 లకు పైగా నిర్వహిస్తుందని తెలుస్తుంది. ఈ ఘటనలో నిందింతుల నుండి రూ. 62,620/-, మొబైల్ ఫోన్లు – 11, ప్లేయింగ్ కార్డ్స్ – 05 సెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.