Trending Now

ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సంబరాలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30 : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్స్ కు నెలసరి ఉద్యోగులు గంపబట్టి వారికి వేతనాలు పెరగడంతో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సారంగాపూర్ మండలం చించోలి (బీ) అంబేద్కర్ చౌక్ ప్రధాన జంక్షన్ వద్దలో గల బీడీ ఫ్యాక్టరీ లో మిఠాయిలు పంచుకుంటూ, సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విజయోత్సవ సభ జరిగింది, ప్యాకింగ్ జిల్లా నాయకులు రమేష్ అధ్యక్షతన జరిగి న, ఈ సభలో ముందుగా చర్చలో పాల్గొన్న, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రాజన్నకు సాల్వతో సన్మానం,కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కే రాజన్న మాట్లాడుతూ.. కార్మికుల వేతనాల పెరుగుదల కార్మికుల సమిష్టి కృషి ఫలితంగా జరిగిందని కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చే బీడీ పరిశ్రమ రోజు రోజు నిర్వీర్యమైపోతుందని బీడీ కార్మికులకు పని లేక అతి తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వాలే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ, పురేగుర్తు ఫిక్టోరియల్ వార్నింగ్, పెట్టడంతో బీడీ పరిశ్రమ తగ్గిపోయి ఉపాధి దొరకక కార్మికులు అర్ధాకలితోబాధపడుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాలని డిమాండ్ చేశారు.

బీడీ పరిశ్రమలో జీవన భృతి రాని కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీవన భృతి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని లేని యేడలో త్వరలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పెరిగిన వేతనాలు మే నెల నుంచి అమలు జరుపబడతాయని 1000 బీడీకి రూ 4-25 పైసలు, బీడీ ప్యాకర్లకు నెలకు,రూ.3650, లు నెలసరి ఉద్యోగులకు రూ. 1700 లు పెరిగినట్లు పెరిగిన వేతనాలు తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మందికి అమలు జరుగుతాయని, ఈ అగ్రిమెంటు 2026 సంవత్సరం వరకు అమల్లో ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రామ లక్ష్మణ్, బంతి నాయకురాలు కే. లక్ష్మి, గంగామణి, రాజేందర్, రవి వెంకటి, లక్ష్మణ్, రవి కమల, కవిత తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News