[t4b-ticker]

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్

చండూరులో టీయూడబ్ల్యూజే-143 నూతన కమిటీ ఎన్నిక.

అధ్యక్షుడిగా ఆడపు పరమేష్ – ప్రధాన కార్యదర్శిగా వరికుప్పల సురేష్ ఏకగ్రీవ ఎన్నిక .

ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 16: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోనీ స్థానిక మున్సిపాలిటీలోని భారతి చంద్ర గార్డెన్ లో టీయూడబ్ల్యూజే (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్) చండూరు మండల కమిటీ సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. చండూరు మండల టీయూడబ్ల్యూజే కమిటీ అధ్యక్షులుగా ఆడెపు పరమేశ్ (10TV), ప్రధాన కార్యదర్శిగా వరికుప్పల సురేష్ (నమస్తే తెలంగాణ) లను సభ్యులందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజంలో నాల్గవ స్తంభంగా పనిచేస్తున్నారని, వారి సమస్యల పరిష్కారమే సంఘం ప్రధాన లక్ష్యమని అన్నారు. అలాగే జర్నలిజం విలువలను కాపాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు తమ వంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సీనియర్ జర్నలిస్టులకు, యువ జర్నలిస్టులకు మధ్య సమన్వయం చాలా అవసరమని అన్నారు.

*జర్నలిస్టులకు అండగా ఉంటాం – జయశంకర్ గౌడ్

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ… జర్నలిస్టులు సమాజంలో నాలుగో స్తంభంగా పనిచేస్తున్నారని, వారి సమస్యల పరిష్కారమే సంఘం ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు తదితర సంక్షేమ పథకాల కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని భరోసా ఇచ్చారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా టీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, నల్గొండ జిల్లా టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్, రాష్ట్ర నాయకులు గోలీ విజయకుమార్, నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జానయ్య, నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలేంక గురుపాదం, టీయూడబ్ల్యూజే మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు బొడ్డు సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కోడి రాములు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో చండూరు మండలంలోని వివిధ పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులకు సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Related News

Latest News