*19 గ్రామ కమిటీల పదవీకాలం పూర్తి – రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు నిర్ణయం.
*త్వరలో నూతన కమిటీల ఏర్పాటు – మండల మేకల సాగర్ రెడ్డి
*అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
*ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజారిటీ తో గెలిపించాలి.
*చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి .
ప్రతిపక్షం చండూరు అక్టోబర్ 31: చండూరు మండల పరిధిలోని 19 గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను రద్దు చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి తెలిపారు. గ్రామ కమిటీల పదవీకాలం పూర్తయినందున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనలు, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాష్ నేత మార్గదర్శకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నిబద్ధతతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించడం లక్ష్యంగా త్వరలో నూతన గ్రామ శాఖ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
*అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని మేకల సాగర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజారిటీ తో గెలిపించాలి అన్నారు .పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీ చివరి గడువు అని స్పష్టం చేశారు. అర్హత కలిగిన పట్టభద్రులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ముందుగానే ఫారం-18 (Form-18) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకునే నాటికి మూడేళ్ల క్రితమే (తత్సమాన కాలం కంటే ముందు) డిగ్రీ పూర్తి చేసిన స్థానిక పట్టభద్రులు మాత్రమే ఓటు హక్కుకు అర్హులు.అర్హులైన వారు తమ డిగ్రీ/పట్టా ధ్రువపత్రాలు మరియు నివాస గుర్తింపు కార్డులతో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు .
ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ నలపరాజు శివనారి, జిల్లా నాయకులు కావాలి ఆంజనేయులు, కాసాల జనార్దన్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కృపాటి గణేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు, ఎఫ్ ఎస్ డైరెక్టర్ కట్ట బిక్షం, సర్పంచులు ముక్కామల వెంకన్న ,బొమ్మల శేఖర్ ,జాల వెంకన్న ,బోయపల్లి శీను, ఉప సర్పంచ్ల మండల పూర్వ అధ్యక్షుడు సరికొండ ముత్యాలు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సోమలింగస్వామి, ఉపాధ్యక్షులు గంతేకంపు అశోక్ ,యువజన కాంగ్రెస్ నాయకులు భూషిపాక శంకర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పంగా రామకృష్ణ ,ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్కల దశరథ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శేఖర్ ,మండల సెక్రెటరీ లు కట్టెకోల రామేశ్వరావు,ఇరిగి నరసింహ, తీగల శేఖర్,పర్సనబోయిన యాదయ్య ,ఉంగరాల వేమయ్య , దాసరి ఆంజనేయులు ,మండల నాయకులు బుర్కల ఎలక్షన్,ఇరిగి బిక్షం, మహిపాల్ రెడ్డి కృపాటి శ్రీను, రామలింగం కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.































