PM Modi – సీజేఐ నివాసంలో గ‌ణ‌ప‌తి పూజ.. హాజరైన ప్రధాని మోదీ

PM Modi Joins Ganesh Puja at CJI Home: ఢిల్లీలోని ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారు. గణేష్ వేడుకల నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర సంప్రదాయంలో టోపీ ధరించి హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకు సీజేఐ డీవై చంద్రచూడ్, ఆయన భార్య కల్పనాదాస్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ గణపతి పూజకు హాజరై హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేశారు.

అయితే ప్రధాని నేరుగా సీజేఐ ఇంటికి వెళ్లడాన్ని రాజకీయ నాయకులు రకరకాలుగా చర్చించు కోవడం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. సీజేఐ చంద్రచూడ్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని, అందులోనూ వారికి ముఖ్యమైన పండుగ గణేష్ ఫెస్టివల్ అని అంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛ‌నీయ‌ ఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది.

Related News

Latest News