Devender Singh Rana: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తమ్ముడు దేవేందర్‌ సింగ్‌ కన్నుమూత

Devender Singh Rana passed Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తమ్ముడు దేవేందర్‌ సింగ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫరీదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. రాణా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవేందర్‌సింగ్‌ మృతిపై లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తనను బాధకు గురిచేసిందన్నారు. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సురీందర్‌ కుమార్‌ చౌదరీ కూడా సంతాపం వ్యక్తం చేసి.. దేవేందర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related News

Latest News