Trending Now

ఎవరెస్ట్, MDH మసాలాలపై మరో దేశం నిషేధం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భారత్‌కు చెందిన ఎవరెస్ట్, MDH మసాలాలపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది. ఈ మసాలాల్లో క్యాన్సర్ కారక పదార్థాలున్నాయనే కారణంతో ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ బ్యాన్ చేయగా.. తాజాగా మన పొరుగు దేశం నేపాల్ సైతం నిషేధించింది. ఈ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథిలీన్ ఆక్సైడ్ క్రిమిసంహారకాన్ని గుర్తించిన నేపాల్ వీటిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. దిగుమతులతో పాటు విక్రయాలనూ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై నేపాల్‌కు చెందిన ఆహార నియంత్రణ సంస్థ పరీక్షలు ప్రారంభించింది. ఈ అధ్యయనంలో అధికారులు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను గుర్తించారు. ప్రస్తుతం తాము ఈ రెండు కంపెనీల మసాలాలను పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. తుది నివేదిక వచ్చే వరకు నిషేధం ఉంటుందని తెలిపింది.

Spread the love

Related News

Latest News