Kishan Reddy: యువతలో సామాజిక స్పృహ పెరగాలి.. కిషన్ రెడ్డి

Kishan Reddy short film released: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్విరాన్ మెంట్‌పై తీసిన షార్ట్ ఫిల్మ్‌ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూన వెంకట్ మా పార్టీ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు. అనేక సామాజిక సినిమాలు తీసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అని కొనియాడారు. ఈ షార్ట్ ఫిల్మ్ చాలా సందేశాత్మకంగా ఉందని, చాలా అద్భుతంగా రూపొందించారన్నారు. కాలుష్యం మానవాళికి ప్రమాదకరంగా మారిందని, యువతలో సామాజిక స్పృహ పెరగాలన్నారు. పదేళ్ల క్రితం గాంధీ జయంతి రోజున ప్రధాని మోదీ స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఎన్విరాన్ మెంట్‌లో భాగంగా తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.

Related News

Latest News