Telangana: నేటి నుంచి కుల గణన సర్వే

Telangana Caste Census Survey: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను నేటి నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. కుల గణన బాధ్యతలను ప్లానింగ్ డిపార్ట్ మెంట్‌కు అప్పగించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలపై సమగ్ర సర్వే నిర్వహించనుంది. సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 75 రకాల ప్రశ్నలతో గణకులు వివరాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 9లోగా బీసీ కుల గణన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 64 నుంచి 75 ప్రశ్నలతో ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు సమాచారం.

Related News

Latest News