[t4b-ticker]

మోదీ ‘క్షమిస్తున్నా’ వీడియోపై అభిజీత్ సెటైర్.. కేసుల ఉపసంహరణపై ప్రశ్న

ప్రతిపక్షం, ఆగస్టు 01: ప్రధాని నరేంద్ర మోదీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విద్యార్థులను క్షమిస్తున్నానంటూ విడుదల చేసిన వీడియోపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆయన, “ఫ్రెండ్.. కేవలం రీల్‌లోనే క్షమిస్తారా? లేక విద్యార్థులపై నమోదైన కేసులను కూడా వెనక్కి తీసుకుంటారా?” అంటూ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యకు సోషల్ మీడియాలో విస్తృత స్పందన లభించగా, పోస్టుకు 1.26 లక్షలకు పైగా లైక్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీ, ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా తనపై, తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యార్థుల గురించి ప్రస్తావించారు. చిన్న వయసులో తప్పులు జరగడం సహజమని, వారిని ద్వేషించడం కంటే సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని పేర్కొన్నారు. వారిని తాను వ్యక్తిగతంగా క్షమిస్తున్నానని కూడా తెలిపారు.

అయితే ఈ వ్యాఖ్యల అనంతరం విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అభిజీత్ దీప్కే చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Spread the love

Related News

Latest News