చూపు అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం: కోమటిరెడ్డి లక్ష్మీ

*మీ బాధ్యత నాదే దైర్యంగా వెళ్లి కండ్లు చూయించుకుని రండి.

*మునుగోడులో ముసలోళ్ల సూపు బాగుకోసం నిర్విరామంగా ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ.

*మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

ప్రతి పక్షం మునుగోడు నవంబర్ 01: మునుగోడులో 18వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు ప్రారంభించారు.తన మాత్రుమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యలతో బాదపడొద్దనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది..ఇప్పటి వరకు 17 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 13430 మందికి కంటి పరీక్షలు చేయించి 2859 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేసి, 6075 మందికి కండ్ల జోళ్లు పంపిణీ చేశారు.ఈరోజు 18 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించారు….ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్నిగౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆయన సతీమణి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ సర్స్ కోమటిరెడ్డి లక్ష్మీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు.అనంతరం తన మాత్రుమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానిక పూలమాలలు వేసి నివాళులర్పించారు.మొత్తం 4 కౌంటర్లలో కండ్లను పరీక్షించుకుంటున్న వ్రుద్దులను , మహిళలను కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు ఆత్మీయంగా పలకరిస్తూ వైద్య శిబిరం జరుగుతున్నతీరును పరిశీలించారు.ఆపరేషన్లకు ఎంపికైన వుద్దులను వ్రుద్ద మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ నేనున్నానని భరోసా ఇచ్చారు.

కంటి చూపు అనేది ప్రతిఒక్కరికి చాలా ముఖ్యమని నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాదపడకుండా వారికి మెరుగైన కంటి వైద్యం అందించడమే తమ ఫౌండేషన్ లక్షమని అన్నారు కోమటిరెడ్డి లక్ష్మీ వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించి ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అని దగ్గరుండి చూసుకున్నారు..ఈరోజు జరిగిన 18 వవిడత కంటి వైద్య శిబిరంలో 623 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 228 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు..వీరిలో 109 మందిని వెంటనే హైదరాబాద్ లోని శంకరా కంటి ఆసుపత్రికి పంపించారు..ఫీనిక్స్ ఫౌండేషన్ , శంకరా కంటి ఆసుపత్రి వారి సహకారంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

Related News

Latest News