కష్టకాలంలో బాధిత కుటుంబాలకు చేయూత
మానవతను చాటిన వంగ రాజేశ్వర్ రెడ్డి
ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 1: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని యువ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి నిరూపించారు. నంగునూరు మండలంలోని రెండు బాధిత కుటుంబాలకు వంగ రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ఆర్థిక సాయం అందించారు.సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అక్కోజు ఈశ్వరయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబం ఎదుర్కొంటున్న విషాద సమయంలో వారికి ధైర్యం చెప్పా రు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000 అందజేశారు. నంగునూరు మండలంలోని ముండ్రాయి గ్రామానికి చెందిన రాగుల స్వామి మరణించిన విషయం తెలుసుకున్న ఆయన, మృతుడి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కుటుంబ సభ్యుల బాధను పంచుకుని వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యుడిని కోల్పోవడం తీరని లోటని, ఆపదలో ఉన్న కుటుంబాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహాయం అందించాలన్నారు. అవసరం వచ్చినప్పుడు బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. రెండు కుటుంబాల విషాద సమయంలో స్పందించి, వారికి ఆర్థికంగా చేయూత అందించిన వంగ రాజేశ్వర్ రెడ్డి మానవీయతను స్థానికులు అభినందించారు.




























