సెప్టెంబర్‌లో బిగ్‌బాస్‌-10.. హోస్ట్‌లపై క్లారిటీ

ప్రతిపక్షం, జూలై 21: ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్‌-10 సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోని బిగ్‌బాస్‌ ఎడిషన్లను ఒకేసారి ప్రారంభించనున్నట్లు జియోస్టార్‌ ప్రకటించింది.

తెలుగు బిగ్‌బాస్‌-10కు నాగార్జున, హిందీ వెర్షన్‌కు సల్మాన్‌ఖాన్‌, తమిళానికి విజయ్‌ సేతుపతి, కన్నడకు కిచ్చా సుదీప్‌, మలయాళానికి మోహన్‌లాల్‌ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. బెంగాలీ ఎడిషన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించనుండటం విశేషం.

Spread the love

Related News

Latest News