ప్రతిపక్షం, జూలై 21: ‘ఎన్‌బీకే 111’ సినిమా షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ‘గెట్ వెల్ సూన్ బాల బాబాయ్.. మీరు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. తిరిగి పూర్తి ఫామ్‌లోకి రావాలి. అందుకోసం ఎదురుచూస్తున్నా’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మరోవైపు బాలకృష్ణ త్వరగా కోలుకుని యథావిధిగా షూటింగ్‌లో పాల్గొనాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. బాలయ్యను ఫోన్‌లో పరామర్శించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.



















