ప్రతిపక్షం, తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గంగా హాస్టల్ రూమ్ నెం:117లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం పాలైంది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దావూరుకు చెందిన తెనుగు శిరీష పీయూసీ 1 చదువుతోంది. అయితే ఆమె బావ తాజాగా మరణించాడు. అతని మరణాన్ని జీర్ణించుకోలేక శిరీష తల్లిదండ్రులకు సారీ చెబుతూ సూసైడ్ లేఖ రాసింది. ఆ తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.