ద్విచక్ర వాహనం, కారు ప్రమాదవశాత్తు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 22 : నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లి గ్రామ సమీపంలో నిర్మల్ ఖానాపూర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనం, కారు ప్రమాదవశాత్తు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరి కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగంగా వచ్చిన కారు సినిమా షూటింగ్ తరహాలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దాని పైన ఉన్న ఇద్దరూ తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర, స్వల్ప గాయాలు సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికంగా ఉన్నవారు వాహానచోదకులు, ఇతరులు ప్రమాద విషయాన్ని 108 సిబ్బందికి హుటాహుటిన సమాచారం ఇచ్చారు. ఆలస్యం కావడంతో స్థానికంగా 108 సిబ్బంది తీరుపై ఆందోళన చేశారు. క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
నిర్మల్ రూరల్ పోలీసులు ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదం జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదం మాత్రం సినిమా షూటింగ్ తరహలో అతివేగంగా కారు రోడ్డు డివైడర్లను ఢీకొని నేరుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నిర్మల్ జిల్లా రత్నాపూర్ కాండీ గ్రామ వాసులకు ఢీ కొనడంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. కారు అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికంగా ఉన్న ప్రత్యక్ష సాక్షిల ద్వారా తెలుస్తోంది.