ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి

అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 3: ప్రభుత్వం సూచించిన గరిష్ట ధరలకే బియ్యం విక్రయించాలని, నిర్ణీత ధరలకు మించి విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి పి. నిత్యానంద్ హెచ్చరించారు.మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మెదక్ పట్టణంలోని ఆర్ష్‌దీప్ సూపర్ మార్కెట్, జి.వి. సూపర్ మార్కెట్‌తో పాటు పలు బియ్యం విక్రయ దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిత్యానంద్ మాట్లాడుతూ బియ్యం వ్యాపారులు ప్రభుత్వం సూచించిన గరిష్ట ధరలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. బియ్యం రకాల వారీగా నిర్ణయించిన ధరలు కిలోకు BPT/కేఎన్ఎం రూ.66, ఆర్ఎన్ఆర్/తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ/జేఎస్ఆర్ రూ.79గా ఉన్నాయని తెలిపారు.ఈ ధరలకు మించి విక్రయాలు చేపడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులకు న్యాయమైన ధరలకు బియ్యం అందేలా నిరంతర తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు.ఈ తనిఖీల్లో అసిస్టెంట్ పౌర సరఫరాల అధికారి ఎం.డి. అబ్దుల్ నిస్సార్, పౌర సరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్ తాటి నర్సింలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News