Trending Now

త్వరలో రేషన్ కార్డులు..

యూవిటర్ వేదికగా మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్, ప్రతిపక్షం: కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయా అని అతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి ఎక్స్(ట్విట్టర్‌) వేదికగా ప్రకటిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా రేషన్ కార్డులు మాత్రం రాలేదు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి.

గత బీఆర్ఎస్ (BRS)​ ప్రభుత్వం రేషన్​ కార్డులు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేసింది. సంక్షేమ పథకాలు అందుకునే వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ రేషన్ కార్డు ఉంటేనే పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారంటీలకు అర్హులు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేయడానికి ముందుకొచ్చింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ మొదలుపెడతాం. రేషన్ కార్డులు లేక పేద, మధ్య తరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆ బాధలను తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్​ ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు.

Spread the love

Related News

Latest News