నిర్మల్లో పాత్రికేయుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు..
ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8 : పత్రికారంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచి తెలుగు భాష అభ్యున్నతికి పాటుపడిన రామోజీరావు మృతి రాష్ట్రం తో పాటు దేశానికి తీరనిలోటని పలువురు పాత్రికేయులు అన్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం స్థానిక ఆర్ అండ్ బీ విశ్రాంత భవనంలో శనివారం నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడుతూ వివిధ వ్యాపారాలను నెలకొల్పి, నిజాయితీ,నాణ్యతతో ప్రజాదరణ చూరగొన్నారన్నారు.పాత్రికేయరంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పోశెట్టి, శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్, ఠాకూర్ ఆనంద్ సింగ్, సాయన్న, వేణుగోపాల్, సురేష్, మహేష్, నరేష్ మిర్జా అథర్ బేగ్, తదితరులు ఉన్నారు.